ఈ కన్ను కొట్టే పిల్లపై 'అమూల్' వాళ్ల కన్ను పడింది

updated: February 17, 2018 13:25 IST

కరెంట్ ఎఫైర్స్ తీసుకుని..వాటితో బిజినెస్ కు యాడ్స్ చేయటం మంచి టెక్నిక్ అనే చెప్పాలి. జనాలకి ఈజీగా దగ్గరవ్వటానికి ఈ మార్గం. అదే  దేశంలో గొప్ప పాల ఉత్పత్తి కంపెనీగా పేరు బడ్డ  అమూల్ బ్రాండ్ వారు ఫాలో అవుతున్నారు. వారు కరెంట్ ఎఫైర్స్ ని లింక్ చేస్తూ .. రోజూ వేసే కార్టూన్లు కేకపెట్టిస్తూంటాయి.  ఆ మధ్యన అమీర్ ఖాన్.. దంగల్ విడుదల అయినప్పుడు కూడా దంగల్ ది బైట్.. ప్రతీ పిల్లకి అవసరమైంది అని చెప్పుతూ కార్టూన్ వేసి దేశం మొత్తం మార్కులు కొట్టేసారు. ఆ తర్వాత ...బాహుబలి మీద వేసారు.

 

  అలా వరసపెట్టి క్రికెట్  మీద కావచ్చు,  ప్రభుత్వ పధకం కావచ్చు వివక్షత పైన కావచ్చు లోకపాల్ బిల్ కావచ్చు.. దేని మీదైనా వాళ్లు కార్టూన్ వేసేస్తూంటారు.   దేశం మొత్తం ఏదైతే మాటలాడుకుంటుందో దాన్ని గురించి కార్టూన్ వేయటమే కలిసివస్తోంది . అది  ఆ అంశానికి సపోర్ట్ గానా సెటైర్ గానా అనేది సదరు వార్తపై ఆధారపడి ఉంటుంది.  . ఇప్పుడు దేశం మొత్తం ఒకే సినిమా  ‘ఓరు ఆధార్ లవ్’ గురించి మాట్లాడుతోంది . దాంతో ఈ విషయం మీదా ఆ కార్టూన్ వేసేసారు. ఆ కార్టూన్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. 

 

 

ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క వీడియో తో ఇండియా మొత్తం పాపులరయ్యింది. మలయాళం సినిమా ‘ఓరు ఆధార్ లవ్’ లోని ‘మాణిక్య మలరాయ పూవి’ అనే సాంగ్ లో ఈ అమ్మాయి హావభావాలకి కుర్రకారు పిచ్చెక్కిపోయారు. తన వాలు చూపులతో కుర్ర కారును ఆకట్టుకున్నా ఈ అమ్మాయికి ఇప్పుడు సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

comments